charan: 'అజర్ బైజాన్' కి చరణ్ .. అక్కడ షూటింగ్ జరుపుకుంటోన్న తొలి తెలుగు చిత్రం ఇదే!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • ముఖ్య పాత్రల్లో ప్రశాంత్ .. స్నేహా 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్  
చరణ్ హీరోగా బోయాపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఐరోపాలో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఐరోపాలోని 'అజర్ బైజాన్' లో 30 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు.అక్కడ షూటింగ్ జరుపుకుంటోన్న తొలి తెలుగు చిత్రం ఇదేనని అంటున్నారు.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తూ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో, సీనియర్ హీరో ప్రశాంత్ .. స్నేహా .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండటం విశేషం. పవన్ పుట్టినరోజు సందర్భంగా వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.  
charan
kiara advani

More Telugu News