బ్యాంకుల మూత అవాస్తవం... అదేమీ లేదన్న ఎన్‌వోబీడబ్ల్యూ ఉపాధ్యక్షుడు అశ్వని రాణా
- రేపటి నుంచి వారం పాటు బ్యాంకులు మూతంటూ వార్తలు
- ఖండించిన బ్యాంకు ఉద్యోగులు
- సమ్మె నిజమే కానీ.. బ్యాంకులపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ
కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయని సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. శనివారం చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవని, ఆదివారం, ఆ తర్వాత సోమవారం కృష్ణాష్టమి, ఆ తర్వాత రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు తెరుచుకోవన్న వార్త వైరల్ అయింది. దీంతో స్పందించిన రాణా అటువంటిదేమీ లేదని, బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని వివరణ ఇచ్చారు.