Harikrishna: వాహన గండం ఉందని హరికృష్ణను ముందే హెచ్చరించిన సిద్ధాంతి!

  • జానకీరామ్ కు రోడ్డు ప్రమాదం జరగవచ్చని చెప్పిన ప్రముఖ సిద్ధాంతి
  • కుమారుడి మరణం తరువాత అతని మాటలపై గురి
  • కొంతకాలం జాగ్రత్తగా ఉండాలని హరికృష్ణకు సూచించిన సిద్ధాంతి
  • అంతలోనే అనుకోని ఘోరం
వాహన గండం ఉందని, ప్రయాణించే సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఓ ప్రముఖ సిద్ధాంతి ఒకరు కొద్దికాలం క్రితం నందమూరి హరికృష్ణను హెచ్చరించారని, ఆ కారణంతోనే ఆయన డ్రైవర్ ను కూడా పెట్టుకోకుండా, తన వాహనాన్ని తానే నడుపుకుంటూ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2014లో జనకీరామ్ మృతి చెందక ముందే, ఆయన జాతక చక్రాన్ని పరిశీలించిన ఈ సిద్ధాంతి, రోడ్డు ప్రమాదం గురించి హరికృష్ణకు చెప్పారని, జానకీరామ్ మరణం తరువాత, అతని మాట మీద గురి కుదిరిందట.

 అదే సిద్ధాంతి ఆ తరువాత హరికృష్ణ జాతకాన్ని చూసి, కొంతకాలం పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పారట. అందువల్లే హరికృష్ణ, తనకు అత్యంత నమ్మకస్తులైన రావి వెంకట్రావు లేదా శివాజీల్లో ఒకరికి డ్రైవింగ్ సీటును అప్పగించేవారు. మరెవరినీ తాను కూర్చున్న వాహనాన్ని నడపనిచ్చేవారు కాదు. ప్రమాదం జరిగిన బుధవారం నాడు సైతం, వాహనాన్ని తాను నడుపుతానని వెంకట్రావు కోరగా, అల్పాహారం చేసిన తరువాత స్టీరింగ్ ఇస్తానని హరికృష్ణ బదులిచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Harikrishna
Janakiram
Road Accident

More Telugu News