Rammohan naidu: హోదాపై మళ్లీ గళమెత్తిన రామ్మోహన్‌.. హోం శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కడిగిపారేసిన ఎంపీ!

  • ఆర్థిక సంఘం చెప్పడం వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్న అధికారులు
  • ఎక్కడ రాసుందో చూపించాలన్న ఎంపీ
  • కుంటి సాకులతో తప్పించుకోవద్దని మండిపాటు

ఢిల్లీలో గురువారం నిర్వహించిన  హోం శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయడు ఏపీకి ప్రత్యేక హోదాపై మరోమారు తీవ్రంగా స్పందించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే తాము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని అధికారులు చెప్పినప్పుడు ఎంపీ ఘాటుగా స్పందించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు రానేలేదన్నారు. ఈ హామీ ఇచ్చిన చాన్నాళ్లకు ఆ సిఫార్సులు వచ్చాయన్నారు.

ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని తామెక్కడా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులే పలుమార్లు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. దీనికి తోడు ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలన్న నిబంధన కూడా ఎక్కడా లేదన్నారు. వాస్తవం ఇలా ఉండగా, ఆర్థిక సంఘం సిఫార్సుల సాకుతో ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడం బాధాకరమన్నారు.  

More Telugu News