hari krishna: నా భాషకు అనువాదం అవసరం లేదు సార్.. కావాల్సింది ఎక్స్ ప్రెషనే!: నాడు రాజ్యసభలో గర్జించిన హరికృష్ణ

  • రాజ్యసభలో 2013 ఆగస్టు 12న చివరి ప్రసంగం
  • తెలుగును ఇంగ్లీష్, హిందీల్లోకి అనువదించే దుబాసీలు లేరన్న కురియన్
  • తెలుగు వ్యక్తిని నేను.. తెలుగులోనే మాట్లాడతానన్న హరి

దివంగత నందమూరి హరికృష్ణకు మాతృ భాష అన్నా, తెలుగు గడ్డ అన్నా ఎంతో మమకారం. రాష్ట్ర విభజనకు అప్పటి యూపీఏ ప్రభుత్వం సిద్ధమైన వేళ... తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ 2013 ఆగస్టు 12న రాజ్యసభలో ఆయన చివరి ప్రసంగం చేశారు. తెలుగులో మాట్లాడేందుకు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్ నిరాకరిస్తూ... తెలుగును హిందీ, ఇంగ్లీషులోకి తర్జుమా చేసే దుబాసీ లేరని వారిస్తున్నప్పటికీ... ఆయన తన ప్రసంగాన్ని తెలుగులోనే కొనసాగించారు.

'ఫస్ట్ ఐయాం ఇండియన్. ఐ బార్న్ ఇన్ ఆంధ్ర. ఐయామ్ తెలుగు మ్యాన్. దట్స్ వై ఐ లైక్ టు స్పీక్ ఇన్ తెలుగు' (తొలుత నేను భారతీయుడిని. ఆంధ్రాలో పుట్టా. నేను తెలుగు వ్యక్తిని. అందుకే తెలుగులో మాట్లాడుతున్నా) అంటూ ఇంగ్లీషులో మాట్లాడి... ఆ తర్వాత తన ప్రసంగాన్ని తెలుగులో కొనసాగించారు.

తెలుగుదేలయెన్న దేశంబు తెలుగు
నే తెలుగు వల్లభుండ.. తెలుగొకండ
ఎల్లనృపులగొలువ నెరుగవేబాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
అంటూ రాజ్యసభలో గర్జించారు. 'నా మాటలకు అనువాదం అక్కర్లేదు సార్. కావాల్సింది ఎక్స్ ప్రెషన్ మాత్రమే' అంటూ తెలుగులో ప్రసంగించారు.

More Telugu News