హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకు 450 గజాల స్థలం కేటాయింపు.. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే స్మారకం నిర్మాణం!
- హరికృష్ణ స్మారకం ఏర్పాటుకు స్థలం కేటాయింపు
- అంత్యక్రియలు జరగుతున్న మహాప్రస్థానంలోనే స్మారకం
- నందమూరి కుటుంబంపై కేసీఆర్ కు అంతులేని అభిమానం
అంత్యక్రియలు ముగిశాక... కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు హరి స్మారకచిహ్నాన్ని నిర్మిస్తారు. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఈ స్మారకం నిర్మాణం జరగనుంది. నందమూరి కుటుంబంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంతులేని అభిమానం ఉంది. తనకు రాజకీయ జన్మను ప్రసాదించిన ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం. 'ఒక్క మగాడు అంటే ఎన్టీఆరే' అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు.