hari krishna: హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకు 450 గజాల స్థలం కేటాయింపు.. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే స్మారకం నిర్మాణం!

  • హరికృష్ణ స్మారకం ఏర్పాటుకు స్థలం కేటాయింపు
  • అంత్యక్రియలు జరగుతున్న మహాప్రస్థానంలోనే స్మారకం
  • నందమూరి కుటుంబంపై కేసీఆర్ కు అంతులేని అభిమానం

దివంగత నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలను టీఎస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. హరి అంత్యక్రియలు జరుగుతున్న మహా ప్రస్థానంలోనే ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా 450 గజాల స్థలాన్ని కేటాయించింది.

అంత్యక్రియలు ముగిశాక... కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు హరి స్మారకచిహ్నాన్ని నిర్మిస్తారు. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఈ స్మారకం నిర్మాణం జరగనుంది. నందమూరి కుటుంబంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంతులేని అభిమానం ఉంది. తనకు రాజకీయ జన్మను ప్రసాదించిన ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం. 'ఒక్క మగాడు అంటే ఎన్టీఆరే' అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు.

More Telugu News