hari krishna: హరికృష్ణ భౌతికకాయం పక్కనే చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు

  • అశేష జనవాహిని మధ్య కొనసాగుతున్న అంతిమయాత్ర
  • వాహనంలో హరి భౌతికకాయం పక్కన నిల్చున్న చంద్రబాబు
  • మహాప్రస్థానం వద్దకు చేరుకున్న పలువురు ప్రముఖులు
మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంతిమయాత్ర వాహనంలో హరి భౌతికకాయం పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిల్చున్నారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలబడ్డారు. టీడీపీ నేతలతో కలసి నారా లోకేష్ వాహనం ముందు నడుస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య, పోలీసు బ్యాండ్ మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహాప్రస్థానం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరి అంత్యక్రియలు జరగనున్నాయి.
hari krishna
Chandrababu
final journey

More Telugu News