vikram: 'సామి స్క్వేర్' రిలీజ్ డేట్ ఖరారు

  • 'సామి' సీక్వెల్ గా 'సామి స్క్వేర్'
  • విక్రమ్ సరసన కీర్తి సురేశ్ 
  • వచ్చేనెల 20వ తేదీన విడుదల      

గతంలో విక్రమ్ హీరోగా దర్శకుడు హరి 'సామి' అనే సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది .. వసూళ్లపరంగా విక్రమ్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనను ఈ ఇద్దరూ చేశారు. అయితే ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వలన అది ఇంత కాలానికి కుదిరింది.

'సామి స్క్వేర్' గా రూపొందిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటించింది. తమిళంలోనే కాదు తెలుగులోను విక్రమ్ కీ .. కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ రెండు భాషల్లోను ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

More Telugu News