harikrishna: స్వామివారి రోడ్ల కోసం హరి చొరవ తీసుకున్నారు.. ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇచ్చారు!: పోచారం

  • వెల్లడించిన తెలంగాణ మంత్రి
  • చైతన్యరథాన్ని హరి ఒక్కరే నడిపారన్న పోచారం
  • చిన్న ప్రమాదం కూడా జరగలేదని వెల్లడి
నందమూరి హరికృష్ణ  రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యరథంపై హరికృష్ణ వేలాది కిలోమీటర్లు తిరిగారనీ, అయినా చిన్న ప్రమాదం కూడా జరగలేదని తెలిపారు.

తిరుమలలో రోడ్ల నిర్మాణం కోసం హరికృష్ణ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షలను అందజేశారని వెల్లడించారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
harikrishna
Telangana
Road Accident
Pocharam Srinivas

More Telugu News