hari krishna: హరికృష్ణ మెదడులో రక్తం గడ్డ కట్టింది: పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి

  • హరికృష్ణ శరీరానికి కుడివైపు తీవ్ర గాయాలయ్యాయి
  • తలకు బలమైన దెబ్బ తగిలి.. తీవ్ర రక్తస్రావం అయింది
  • ఉదయం 7.15 గంటలకు ఆయన మరణించారు
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మరణంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలముకుంది. ఈ సాయంత్రం ఆయనకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు, హరికృష్ణ భౌతికకాయానికి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆయన మృతికి గల కారణాలను వివరించారు. 'హరికృష్ణ శరీరానికి కుడివైపు తీవ్ర గాయాలయ్యాయి. చెంప భాగం పూర్తిగా దెబ్బతింది. కుడి కంటి పైభాగంలో దెబ్బ తగిలినప్పటికీ, కంటికి ఏమీ కాలేదు. తలపై బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతోపాటు, మెదడులో రక్తం గడ్డ కట్టింది.

ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్యలో ప్రమాదం సంభవించి ఉండవచ్చు. ప్రమాదం చోటు చేసుకున్న స్థలం నుంచి ఆసుపత్రికి తీసుకువచ్చాక... 7.15 గంటల సమయంలో ఆయన మరణించారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు భౌతికకాయాన్ని అందించాం' అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.  
hari krishna
postmortem
report

More Telugu News