Hyderabad: తన తండ్రిని దూరంచేసిన పొలం వద్దంటూ 250 ఎకరాలను తెగనమ్మిన ఎన్టీఆర్‌!

  • హైదరాబాద్ కు ఇష్టం లేకుండా వచ్చాను
  • తాతయ్యతో కలసి ఉండేవాడిని
  • రోడ్డు ప్రమాదంలోనే మరణించిన లక్ష్మయ్య చౌదరి
  • మనస్తాపంతో భూమిని అమ్మేసిన ఎన్టీ రామారావు

హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న వేళ, రామకృష్ణా స్టూడియోను కట్టడం ప్రారంభించిన ఎన్టీ రామారావు, దాని బాధ్యతలు చూసుకునేందుకు హరికృష్ణను హైదరాబాద్ కు రప్పించారు. ఈ విషయాన్ని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న ఆయన, తనకు హైదరాబాద్ రావడం ఇష్టంలేదని, అదే మాట తండ్రికి చెబితే, "నువ్వుంటావనే భావనతోనే స్టూడియో కట్టాను. రావాల్సిందే" అనడంతో తప్పక వచ్చానని అన్నారు.

తాతయ్య లక్ష్మయ్య చౌదరి కూడా నీతోనే ఉంటారని చెప్పడంతో కాదనలేక పోయానని హరికృష్ణ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత శంషాబాద్ సమీపంలో తమకున్న పొలం వద్దకు వెళ్లి వస్తున్న తాతయ్య, రాజేంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారని చెప్పారు. ఈ ప్రమాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎన్టీఆర్, తండ్రిని బలిగొన్న పొలం ఇక మనకు వద్దని అంటూ, 250 ఎకరాల భూమిని తెగనమ్మేశారని వివరించారు. తన తాతయ్యలానే తానూ రోడ్ యాక్సిడెంట్ లోనే మరణించడం యాదృచ్ఛికం. 


  • Loading...

More Telugu News