Andhra Pradesh: చంద్రబాబుకు అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం!

  • వ్యవసాయ రంగంలో చంద్రబాబు కృషికి మరో గుర్తింపు
  • వచ్చే నెల 24న ఐరాస సభలో చంద్రబాబు కీలకోపన్యాసం
  • జీరో బడ్జెట్ ఫార్మింగ్‌పై యూఎన్ఓ ప్రశంస
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఆహ్వానం అందింది. ‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’ అంశంపై ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో వచ్చే నెల 24న న్యూయార్క్‌లో జరగనున్న సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. 2024 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన ఐరాస ప్రశంసించింది. ఈ విషయంలో తాను కూడా సాయం అందించేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయ రంగంలో చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించిన ఐరాస ఈ మేరకు ఆహ్వానించింది.
Andhra Pradesh
Chief Minister
Chandrababu
UNO
Zero budget Farming

More Telugu News