anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగులో డబ్బింగ్ చెప్పేసిన అనుపమ! 
  • శివ దర్శకత్వంలో అల్లు అర్జున్?
  • 'గీత గోవిందం' దర్శకుడికి అడ్వాన్సుగా ఫ్లాట్ 
  • తమిళంలోకి నాని హిట్ సినిమా  

*  సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే హీరోయిన్ల జాబితాలో తాజాగా అనుపమ పరమేశ్వరన్ కూడా చేరింది. తాజాగా రామ్ తో కలసి తాను నటించిన 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రానికి అనుపమ డబ్బింగ్ చెప్పింది.
*  అల్లు అర్జున్ నటించే తెలుగు, తమిళ చిత్రం గురించి తాజాగా మరో విశేషం వెల్లడైంది. జ్ఞానవేల్ రాజా నిర్మించే ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహిస్తాడని నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జరిగిన మార్పు కారణంగా, ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు శివ తాజాగా అజిత్ తో 'విశ్వాసం' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
*  తాజాగా 'గీత గోవిందం' చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసిన దర్శకుడు పరశురాం తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం పారితోషికానికి సంబంధించి అడ్వాన్సుగా ఓ కొత్త ఫ్లాట్ ను దర్శకుడికి నిర్మాత బన్నీ వాసు ఇచ్చాడట.  
*  నాని హీరోగా నివేదా థామస్ హీరోయిన్ గా నటించిన 'నిన్ను కోరి' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వెర్షన్లో వైభవ్ హీరోగా నటిస్తాడట. 

More Telugu News