Dayalu Ammal: అపోలో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్.. ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించని వైద్యులు!

  • మూడేళ్ల క్రితం అల్జీమర్స్ వ్యాధి బారిన పడిన దయాళు 
  • 12 ఏళ్ల చిరుప్రాయంలోనే కరుణానిధిని పెళ్లాడిన అమ్మాళ్ 
  • ఆందోళనలో కరుణానిధి అభిమానులు
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ (82) అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, వైద్యులు మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. గత మూడు సంవత్సరాలుగా ఆమె అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు.

12 ఏళ్ల చిరుప్రాయంలోనే కరుణానిధిని పెళ్లాడిన దయాళు అమ్మాళ్‌ ప్రవర్తనలో 2012 నుంచి మార్పు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. ఆమె అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు 2015లో వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సమాచారం వెల్లడించకపోవడంతో కరుణానిధి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దయాళు అమ్మాళ్‌పై మనీలాండరింగ్ వంటి కేసులు కూడా ఉన్నాయి. డీఎంకే నూతన అధ్యక్షుడు స్టాలిన్, సోదరుడు అళగిరి ఆమె సంతానమే!    
Dayalu Ammal
karunanidhi
DMK
Tamilnadu
chennai

More Telugu News