hari krishna: హరికృష్ణ-లక్ష్మీకుమారిల పెళ్లి నాటి శుభలేఖ!

  • సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వైనం
  • 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగిన వివాహం
  • ఎన్టీఆర్ తల్లిదండ్రుల పేరిట ఉన్న శుభలేఖ  
టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా, హరికృష్ణ అభిమానులు ఆయనకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఈ క్రమంలో హరికృష్ణ బాలనటుడిగా, యువ నటుడిగా నటించిన చిత్రాల్లో ఫొటోలు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి ఫొటోలు, ఎన్టీఆర్ చైతన్య రథయాత్రలో వాహనం నడుపుతున్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. హరికృష్ణ వివాహానికి సంబంధించిన శుభలేఖను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గమనార్హం. నందమూరి హరికృష్ణ, లక్ష్మీకుమారిల వివాహం 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగింది. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్యచౌదరి, వెంకట్రావమ్మల పేరిట ఈ శుభలేఖ ఉండటం గమనార్హం.
hari krishna
lakshmi kumari

More Telugu News