hari krishna: ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు.. జాతీయ జెండా అవనతం!

  • ఈరోజు, రేపు అధికారిక కార్యక్రమాలు రద్దు
  • జాతీయ జెండాను అవనతం చేయాలంటూ ఆదేశాలు జారీ
  • రేపు సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు
మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు అధికారిక కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ జెండాను అవనతం చేయాలని ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది.

మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
hari krishna
funerals
mourning days
ap
government

More Telugu News