hari krishna: హరికృష్ణకు నివాళులర్పించి..ప్రసంగం ప్రారంభించిన జగన్!

  • హరికృష్ణ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం
  • గ్రేటర్ విశాఖలో అనకాపల్లి చేరాక మేలు జరిగిందా?
  • అధికారంలోకి వచ్చాక అనకాపల్లిని జిల్లాగా చేస్తాం
విశాఖ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనకాపల్లి బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తున్నారు. జగన్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు, ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు నివాళులర్పించారు. హరికృష్ణ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

అనంతరం, జగన్ మాట్లాడుతూ, పేదలకు ఇచ్చే ప్లాట్ లలో కూడా చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్లాట్ లిస్తే తీసుకోమని, తాము అధికారంలోకి వచ్చాక ఆ రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. ‘గ్రేటర్ విశాఖలో అనకాపల్లిని కలిపిన తర్వాత ఏమైనా మేలు జరిగిందా? ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీల బాదుడు ఎక్కువైంది, మేము అధికారంలోకి వచ్చాక అనకాపల్లిని జిల్లాగా చేస్తాం’ అని హామీ ఇచ్చారు. 
hari krishna
Jagan

More Telugu News