nandamuri: నందమూరి కుటుంబాన్ని మరింత క్షోభ పెట్టోద్దు.. మంచు మనోజ్ విజ్ఞప్తి!

  • ట్విట్టర్ లో స్పందించిన మనోజ్
  • ప్రమాద వీడియోలు చూపొద్దన్నహీరో
  • కుటుంబ సభ్యులు కుంగిపోతున్నారని ఆవేదన

ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపై హీరో మంచు మనోజ్ విచారం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియా పదేపదే ప్రమాద ఘటన దృశ్యాలను చూపడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలతో నందమూరి కుటుంబాన్ని మరింత క్షోభకు గురిచేయవద్దని కోరాడు. ఈ మేరకు మనోజ్ ఈ రోజు ఓ ట్వీట్ చేశాడు.

ప్రమాద ఘటన వీడియోను మీడియాలో చూసిన అభిమానులు, కుటుంబ సభ్యులు మరింత కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలనీ.. తన విజ్ఞప్తిని మీడియా మన్నిస్తుందని ఆశిస్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. 

  • Loading...

More Telugu News