Nartanasala: 'నర్తనశాల'పై హిజ్రాల ఆందోళన... ఆడనివ్వబోమని హెచ్చరిక!

  • సినిమాలో కించపరిచే సన్నివేశాలు
  • ట్రయిలర్ లోనే కనిపిస్తున్నాయి
  • తొలగించాల్సిందేనని హిజ్రాల డిమాండ్
త్వరలో విడుదలకు సిద్ధమైన 'నర్తనశాల'లో తమను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, కొందరు హిజ్రాలు హైదరాబాద్, ఫిలింనగర్ లోని ఫిలించాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ఫిలించాంబర్ ఆవరణలో బైఠాయించిన హిజ్రాలు, ట్రయిలర్ లోనే తమను కించపరుస్తున్న సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. వెంటనే ఈ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసిన వాళ్లు, మార్పులు చేయకుంటే సినిమాను ఆడనివ్వబోమని హెచ్చరించారు. తమను కించపరిచేలా ఉన్న అన్ని సన్నివేశాలనూ తొలగిస్తామని హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఫిలింనగర్ లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
Nartanasala
Hizra
Movie
Hyderabad
Film Chamber

More Telugu News