harikrishna: హరికృష్ణను కాపాడుకోలేకపోయాం.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన!

  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన చంద్రబాబు
  • హరికృష్ణ మరణం రాష్ట్రానికి తీరని లోటని వ్యాఖ్య
  • ఎన్టీఆర్ కు హరి అత్యంత ఇష్టుడని వెల్లడి
ప్రముఖ నటుడు హరికృష్ణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలియగానే మంత్రి లోకేశ్ తో కలసి ఆయన హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఘటనాస్థలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం తమ కుటుంబానికి తీరని లోటని తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణం కేవలం టీడీపీకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో హరికృష్ణది అందవేసిన చేయి అని సీఎం అన్నారు. సీనీరంగంతో పాటు రాజకీయాల్లోనే హరికృష్ణ సేవలు ఎనలేనివని బాబు కొనియాడారు.

చైతన్యరథం నడుపుతూ నందమూరి తారక రామారావును హరికృష్ణ ప్రజల చేరువకు తీసుకెళ్లారని చంద్రబాబు అన్నారు. హరికృష్ణ ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టుడన్నారు.

harikrishna
accident
dead
Andhra Pradesh
ntr

More Telugu News