Congress: తప్పు చేసిన కాంగ్రెస్ దిద్దుకునే ప్రయత్నం చేస్తోంది: చంద్రబాబు

  • ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం మర్చిపోయింది
  • మాది ఉడుంపట్టు.. పట్టుకుంటే వదలం
  • ఎన్డీయేను ఓడించి హక్కులు సాధించుకుంటాం
ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని చెప్పి కేంద్రం మోసం చేసిందని, మోసం చేసిన కాంగ్రెస్ తప్పుదిద్దుకునే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ‘నారా హమారా-టీడీపీ హమారా’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తప్పు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ముందుకు వచ్చిందని, ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తమది ఉడుం పట్టని, ఓసారి పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

విశాఖపట్టణం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర హామీలిచ్చిన కేంద్రం ఇప్పుడా ఊసే మర్చిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వడ్డీతో సహా మొత్తం వసూలు చేసి తీరుతామని హెచ్చరించారు. ఎన్డీఏను ఓడించి మరీ హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.
Congress
Telugudesam
Chandrababu
BJP
Guntur
Nara Hamara-Telugudesam Hamara

More Telugu News