Venkaiah Naidu: స్నేహితుల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • రాజకీయాల్లోకి ఇక తిరిగి రాను
  • గ్రామీణులకు సేవ చేయాలన్న చివరి కోరిక మిగిలి ఉంది
  • ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
స్నేహితుల ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ సైబర్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఆత్మీయులందరినీ వెంకయ్యనాయుడు ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

2020 జనవరి 12నాటికి ఢిల్లీ వదిలిపెట్టి వెళ్లాలని తాను ఉపరాష్ట్రపతి కాకముందు అనుకున్నానని, అయితే చివరి క్షణంలో ఆ పదవికి ఎంపికైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పదవికి వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు వివరించారు. రాజకీయాలు వదిలిపెట్టి గ్రామీణ ప్రజలకు సేవ చేయాలన్న చివరి కోరిక మిగిలి ఉందని చెప్పిన వెంకయ్యనాయుడు, రాజకీయాల్లోకి ఇక తిరిగి రానని స్పష్టం చేశారు. ప్రజల భాషలోనే పరిపాలన సాగాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, చట్ట సభల పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
Venkaiah Naidu
vice president

More Telugu News