jayasudha: 'సాగర సంగమం' నేను చేయవలసిన సినిమా.. అలా జారిపోయింది!: జయసుధ

  • 'సాగర సంగమం' మూవీకి సైన్ చేశాను 
  • డేట్స్ సర్దుబాటు చేయడం కుదరలేదు
  • సినిమా వదులుకోవద్దని కమల్ గట్టిగా చెప్పారు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జయసుధ మాట్లాడుతూ, 'సాగర సంగమం' సినిమాను గురించిన ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పుకొచ్చారు. 'సాగర సంగమం' సినిమాకి ముందుగా నన్ను తీసుకున్నారు .. ఆ సినిమాకి నేను సైన్ చేశాను కూడా. ఈ సినిమా కోసం నేను కొన్ని డేట్స్ ఇచ్చాను. కమలహాసన్ గారు ఆ సమయంలో బాగా బిజీగా ఉండటం వలన, నేను డేట్స్ ఇచ్చిన షెడ్యూల్ కేన్సిల్ అయింది.

దాంతో మళ్లీ వాళ్లు నా డేట్స్ అడిగారు. అప్పుడు నేను ఏఎన్నార్ గారి సినిమా ఏదో చేస్తున్నాను. అందువలన డేట్స్ సర్దుబాటు చేయడం కుదరలేదు .. దాంతో జయప్రదను తీసుకున్నారు. ఈ సినిమాను వదులుకోవద్దని కమల్ నన్ను తిట్టారు కూడా .. అయినా తప్పలేదు. ఈ సినిమా చూసిన తరువాత నా కంటే జయప్రదనే ఆ పాత్రకి సరిగ్గా సరిపోయిందని అనిపించింది" అని చెప్పుకొచ్చారు .   
jayasudha

More Telugu News