చైన్ స్నాచర్లపై పాటపాడిన పోలీస్.. శెభాష్ అంటూ బహుమానం అందజేసిన కమిషనర్!
- బెంగళూరులో యువ పోలీస్ చొరవ
- పాటతో చైన్ స్నాచింగ్ పై అవగాహన
- అభినందించిన నగర కమిషనర్
కర్ణాటకలోని బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య చైన్ స్నాచింగ్ లపై నాలుగు నిమిషాల నిడివి ఉన్న వీడియోను రూపొందించాడు. దీనికి కన్నడ సంగీత దర్శకుడు హేమంత్ సంగీతం అందించాడు. చైన్ స్నాచింగ్ లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందులో సుబ్రహ్మణ్య వివరించాడు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో సుబ్రహ్మణ్య చొరవను మెచ్చుకున్న బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్.. ప్రత్యేక బహుమానం అందజేశారు.