Rajiv Gandhi: "మూకహత్యల పిత రాజీవ్ గాంధీ"... బీజేపీ భారీ హోర్డింగులతో పెను దుమారం!

  • భారీ హోర్డింగులు పెట్టించిన తేజీందర్ పాల్ సింగ్
  • లండన్ లో సిక్కు వ్యతిరేక హత్యలపై స్పందించిన రాహుల్
  • కలకలం రేపుతున్న హోర్డింగులు
ఇటీవల తన లండన్ పర్యటనలో భాగంగా సిక్కు వ్యతిరేక దాడులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ చేసిన పని పెను దుమారాన్ని రేపుతోంది. మూక హత్యలకు మూలకారణం రాజీవ్ గాంధీయేనంటూ, భారీ హోర్డింగులను ఢిల్లీ వీధుల్లో ఆయన పెట్టించారు. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన అల్లర్లలో దాదాపు 3 వేల మంది సిక్కులు హత్యకు గురైన సంగతి తెలిసిందే.

 ఈ విషయమై రాహుల్ స్పందిస్తూ, "ఇదో దురదృష్టకర ఘటనని అనడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఇదో బాధాకరమైన అనుభవం. కాంగ్రెస్ పార్టీయే అల్లర్లకు కారణమంటే నేను అంగీకరించను. దాన్ని హింస, దారుణంగా మాత్రం అభివర్ణిస్తా" అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తేజీందర్ పాల్ హోర్డింగులు కలకలం రేపుతున్నాయి.
Rajiv Gandhi
Lynching
BJP
Congress
Anti Sikh Riots
Hordings
Tejinderpal Singh

More Telugu News