Drone: ఇక డ్రోన్లను ఎవరైనా వినియోగించుకోవచ్చు... షరతులు వర్తిస్తాయి!

  • డ్రోన్ల వాడకానికి మార్గదర్శకాలు
  • వ్యక్తులకు, కంపెనీలకూ ఆన్ లైన్ అనుమతి
  • డిసెంబర్ 1 నుంచి అమలు
ఇకపై డ్రోన్లను ఎవరైనా వాడుకోవచ్చు. అయితే, దానికి అనుమతి తీసుకోవాలంతే. డిసెంబర్ 1 నుంచి డ్రోన్ల వాడకానికి సంబంధించి వ్యక్తులకు, కంపెనీలకూ అనుమతులిస్తూ, పౌరవిమానయాన శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఫొటోగ్రఫీ తదితర అవసరాల కోసం ఆపరేటర్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని తక్షణ ఆమోదం పొందవచ్చని తెలిపింది.

250 గ్రాముల కన్నా తక్కువ బరువుండే నానో డ్రోన్లకు అనుమతులు అవసరం లేదని, అయితే, వీటి ఆపరేటర్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి వుంటుందని తెలిపింది. డ్రోన్ల యజమానులు, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆపై వీరు మొబైల్ యాప్ ద్వారానూ అనుమతులు పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టెక్నాలజీ అభివృద్ధికి అనుగుణంగా భవిష్యత్తులో డ్రోన్ల వాణిజ్య వినియోగానికి, డెలివరీ వాహనాలుగా ఉపయోగించుకునేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొంది.
Drone
Aviation Ministry
Online
Lisence
Registration

More Telugu News