Big Boss: బిగ్‌బాస్-2: గణేశ్‌పై తీవ్రవ్యాఖ్యలు చేసిన కౌశల్.. మనస్తాపానికి గురైన గణేశ్

  • గణేశ్ సోమరిపోతన్న కౌశల్
  • నొచ్చుకున్న గణేశ్
  • ఈసారి ఎలిమినేషన్‌లో అందరూ పురుషులే
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ముగింపుకు దగ్గరపడుతున్న కొద్దీ షోలో ఉత్కంఠ పెరుగుతోంది. సామాన్యుడి కోటాలో హౌస్‌లోకి వచ్చిన గణేశ్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్ చేస్తూ కౌశల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గణేశ్ సోమరిపోతని, సమయం దొరికితే చాలు నిద్రపోతుంటాడని వ్యాఖ్యానించాడు. ఆట ఆడడానికి బదులు మాటలు చెప్పి హౌస్‌లో నెట్టుకొస్తున్నాడని పేర్కొన్నాడు. కౌశల్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన గణేశ్.. అతడి వ్యాఖ్యల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నాడు. కౌశల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పాడు.  

కాగా,  ఈ వారం కూడా కౌశల్ నామినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్‌కు నామినేట్ అయిన వారిలో సామ్రాట్, గణేశ్, నూతన్ నాయుడు, అమిత్ ఉన్నారు. ఈసారి మహిళల్లో ఒక్కరు కూడా నామినేట్ కాకపోవడం గమనార్హం.
Big Boss
Nani
Ganesh
Kaushal
Samrat
Amith

More Telugu News