డీఎంకే-కాంగ్రెస్ ల మధ్య పెరుగుతున్న దూరం?
- 30వ తేదీన చెన్నైలో కరుణానిధి సంస్మరణ సభ
- అమిత్ షాకు ఆహ్వానం పంపిన డీఎంకే
- కార్యక్రమానికి హాజరు కాలేని రాహుల్ గాంధీ
ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవడం అనుమానంగానే ఉంది. రాహుల్ విదేశీ పర్యటనలో ఉండటంతో... గులాం నబీ అజాద్ కార్యక్రమానికి హాజరవుతారని ఏఐసీసీ కార్యాలయం తెలిపింది.
సంస్మరణ సభకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, నితీష్ కుమార్, మమతాబెనర్జీ, కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరుకానున్నారని డీఎంకే తెలిపింది. మరోవైపు, ఈ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.