KTR: ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్లను పట్టించుకోం: మంత్రి కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం తమ ఎమ్మెల్యేలకు నగదు డబ్బాలు పంచామని వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. ఇలాంటి చిల్లర మాటలు చాలా మంది మాట్లాడతారని, అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే దగుల్బాజీ ప్రేలాపనలను పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు.. తామూ లేమని స్పష్టం చేశారు.

 పిచ్చి ప్రేలాపనలు చేసే ప్రతిపక్షాలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు మాత్రమే తాము జవాబుదారీ అని అన్నారు. కాంగ్రెస్సోళ్ల బాసులు ఢిల్లీలో ఉన్నారని.. (చిటికిన వేలు చూపిస్తూ) వాళ్లు దీనికి పోవాలన్నా వాళ్ల బాస్ లను అడగాలని, తమకు ఆ అవసరం లేదని.. తమ బాస్ లు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని, తెలంగాణ గల్లీల్లో ఉన్న వారి ఆశీర్వాదాలు తమకు కావాలని, తమ భవిష్యత్తుకు వారే దిక్సూచిగా నిలవాలని కోరుకుంటున్నామని అన్నారు.
Go Back to Shorts
KTR
TRS

More Telugu News