satish reddy: రక్షణ సంస్థలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తా: డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి

  • కొన్ని పరికరాలను సొంతంగా తయారు చేస్తున్నాం
  • మిగతా రంగాల్లో కూడా ఆ స్థాయికి ఎదగాలి
  • అత్యాధునిక యుద్ధ పరికరాల దిగుమతులు లేకుండా చూడాలన్నదే లక్ష్యం

రానున్న ఐదేళ్లలో రక్షణ సంస్థలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్  సతీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రధాని, రక్షణ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కొన్ని పరికరాలను సొంతంగా తయారు చేసుకునే పరిస్థితికి మనం చేరుకున్నామని, ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో మన దేశం ఆరేడు దేశాలలో ఒకటిగా ఉందని అన్నారు. క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, సబ్ మెరైన్స్, రేడార్స్ ను సొంతంగా తయారు చేసుకునే స్థితికి చేరుకున్నామని అన్నారు.

అదే విధంగా, మిగతా రంగాల్లో కూడా ఆ స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో అత్యాధునిక యుద్ధ పరికరాల దిగుమతులు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులు మన దేశం వదిలి వేరే దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, మన దేశంలోనే ఉండి, ఇక్కడ జరిగే రీసెర్చి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి లేదా సొంతంగా పరిశ్రమలు స్థాపించి మన దేశ అవసరాలకు ఉపయోగపడాలని కోరారు. విద్యార్థులు, యువ ఇంజనీర్లకు దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సతీశ్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News