vajpayee: వాజ్ పేయి చితాభస్మాన్ని కలుపుతూ, నదిలో పడ్డ నేతలు

  • ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో ఘటన
  • సామర్థ్యానికి మించి పడవలోకి ఎక్కిన నేతలు
  • ఒడ్డునే జరగడంతో, తప్పిన పెను ప్రమాదం

దివంగత వాజ్ పేయి చితాభస్మాన్ని దేశవ్యాప్తంగా అన్ని నదులలో కలుపుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతలు వాజ్ పేయి చితాభస్మాన్ని నదిలో కలుపుతూ ప్రమాదానికి గురయ్యారు. బస్తీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత రామ్ త్రిపాఠి, ఎంపీ హరీష్ ద్వివేది తదితర నేతలతో పాటు జిల్లా ఎస్పీ దిలీప్ కుమార్ నదిలో చితాభస్మాన్ని కలిపేందుకు పడవ ఎక్కారు.

అయితే, సామర్థ్యానికి మించిన జనం పడవలోకి ఎక్కడంతో, అది బోల్తా పడింది. దీంతో, పడవలోని వారంతా నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నదిలోకి దూకి, నేతలను ఒడ్డుకు చేర్చారు. అయితే, ఈ ప్రమాదం నది ఒడ్డునే చోటుచేసుకోవడంతో, పెను ప్రమాదం తప్పింది. నేతలంతా క్షేమంగానే ఉన్నారని జిల్లా కలెక్టర్ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News