Tamilnadu: అవును.. విద్యార్థులను పడుపు వృత్తిలోకి పంపేందుకు యత్నించా!: తమిళనాడు మహిళా ప్రొఫెసర్ అంగీకారం

  • యువతులకు ఉద్యోగాల ఆశ చూపిన నిర్మల
  • ఫోన్ సంభాషణలు వైరల్
  • కోర్టుకు వాంగ్మూలం సమర్పించిన అధికారులు

కాలేజీ యువతులను ఉన్నతాధికారులు, నేతలో గడపాలంటూ వారిని పడుపు వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించానని తమిళనాడులోని అరుప్పుకోట దేవాంకుర్ ప్రైవేటు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అంగీకరించింది. ఈ మేరకు ఆమె సీబీసీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. కొన్ని నెలల క్రితం కాలేజీ విద్యార్థినులకు ఫోన్ చేసిన నిర్మలాదేవి.. ‘గవర్నర్ తాత (తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్)తో గడిపితే మీకు మంచి మార్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. గవర్నర్ పురోహిత్ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తనకు నిర్మలాదేవితో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆమెతో పాటు మధురై కామరాజార్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, మాజీ పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో కేసును విచారించిన సీబీసీఐడీ.. పక్కాగా ఆధారాలను సేకరించింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో నలుగురు యువతులను పడుపు వృత్తిలోకి నెట్టేందుకు ప్రయత్నించానని పోలీసుల ముందు నిర్మల ఒప్పుకుంది. దీంతో ఆమె వాంగ్మూలాన్ని, నివేదికను పోలీసులు మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు.

More Telugu News