Hyderabad: హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన ఐఏఎస్ అధికారి కుమార్తె!

  • హైదరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఐఏఎస్ అధికారి కుమార్తె గీతాంజలి
  • కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
మద్యం తాగి వాహనాలను నడప వద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా, మందుబాబులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, పలువురు పట్టుబడ్డారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు.

హోండా సిటీ కారు 'టీఎస్ 09 ఈటీ 2000' కారులో వచ్చిన గీతాంజలి అనే యువతి పూటుగా మందు కొట్టి కారు నడుపుకుంటూ వచ్చి పట్టుబడింది. ఈ కారుపై "డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, అడిషనల్‌ డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌" అని రాసుంది. తాను ఐఏఎస్ అధికారి కుమార్తెనని, తననే పట్టుకుంటారా? అని వాగ్వాదానికి దిగింది. మహిళా పోలీసుల సాయంతో ఆమెకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిబంధనల ప్రకారం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు.
Hyderabad
Drunk Driving
Police
IAS Officer
Daughter

More Telugu News