Vizag: జగన్ కు రాఖీ కట్టిన రోజా.. జగన్ సీఎం అయితేనే మహిళలకు రక్షణ అన్న మహిళా నేత !

  • విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర
  • జగన్ ను కలిసి శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన రోజా
  • ఆయన సీఎం అయితేనే మహిళలకు రక్షణ
ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రను నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఈ ఉదయం కలిసిన ఆ పార్టీ మహిళా నేత రోజా, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల సంక్షేమంపై దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రద్ధను కనబరిచేవారని, ఆ తరువాత జగన్ మాత్రమే ఆ పని చేయగల నేతని వ్యాఖ్యానించారు.

జగన్ సీఎం అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందని, జగనన్నకు రాఖీ కట్టడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, జగన్ ప్రకటించిన నవరత్నాలతో మహిళా లోకానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. జగనన్న తనకు ఆది నుంచి ఎంతో అండగా ఉన్నారని, ఎమ్మెల్యే కావాలన్న తన చిరకాల కోరికను ఆయన నెరవేర్చారని గుర్తు చేసుకున్నారు. కాగా, జగన్ కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు.
Vizag
Rakhi
Sravana Pournami
Jagan
Roja

More Telugu News