Priya Warrior: పబ్లిసిటీ మాత్రం వద్దట... కేరళకు రూ. లక్ష సాయం చేసిన హీరోయిన్ ప్రియా వారియర్!

  • నా వంతుగా సాయం చేశాను
  • ప్రచారం కోసం విరాళం ఇవ్వలేదు
  • అందరూ విరాళమివ్వాలన్న ప్రియా వారియర్
  • రూ. లక్ష ఇవ్వడంపై నెటిజన్ల ట్రోలింగ్
తీవ్రమైన కష్టాల్లో ఉన్న కేరళకు తనవంతు సాయం చేశానని, సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నటి ప్రియా వారియర్, తనకు ఎంతమాత్రమూ పబ్లిసిటీ వద్దని, ప్రచారం కోసం తానీ పని చేయలేదని చెబుతోంది. ఓనం పర్వదినం వేళ, తనవంతుగా చిన్న సాయం చేశానని, తన ఫాలోవర్స్ అంతా కూడా వారికి చేతనైనంత విరాళాలు అందించాలని చెప్పింది. మాటలు చెప్పడం కన్నా చేతల్లో చూపిస్తే ప్రభావవంతంగా ఉంటుందని చెప్పిన ప్రియ, విరాళమిచ్చిన వారిని ప్రశంసించకపోయినా ఫర్వాలేదని, తక్కువ చేసి మాత్రం మాట్లాడవద్దని తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది.

 కాగా, 'ఒరు అదార్ లవ్' చిత్రంలోని తన హావభావాలతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన ప్రియ, ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు రూ. 8 లక్షలు వసూలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అటువంటిది ఆమె కేవలం రూ. లక్ష విరాళమిచ్చి, తనకు పబ్లిసిటీ వద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
Priya Warrior
Instagram
Kerala
Floods
Social Media

More Telugu News