jena sena: మహా గర్జనకు ‘జనసేన’ మద్దతు కోరిన వామపక్షాలు!

  • జనసేన’ నేతలతో సీపీఐ రామకృష్ణ చర్చించారు
  • విజయవాడలో సెప్టెంబర్ 15న మహాగర్జన సభ  
  • జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి

విజయవాడలో సెప్టెంబర్ 15వ తేదీన సీపీఐ, సీపీఎంలు తలపెట్టిన మహా గర్జన
సభకు జనసేన పార్టీ మద్దతు కోరాయి. ఆ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈరోజు వచ్చారని, ‘జనసేన’ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ లతో మహాగర్జనకు మద్దతు విషయంపై చర్చించినట్టు తెలిపారు. ఈ నెల 29న అనంతపురం నుంచి రామకృష్ణ, సెప్టెంబర్ 1న విశాఖపట్నం నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బస్సు యాత్రలు ప్రారంభిస్తున్నారని, ఈ విషయాన్ని రామకృష్ణ తెలిపారని అన్నారు. అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర చేసి విజయవాడకు చేరతారని, సెప్టెంబర్ 15 న మహాగర్జన సభ నిర్వహిస్తారని వారు పేర్కొన్నారని అన్నారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు రామకృష్ణ ఈ కార్యక్రమ వివరాలు తెలిపారని, ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో, రాజకీయ వ్యవహారాల కమిటీలోను చర్చించి తెలియచేస్తామని రామకృష్ణకు జనసేన ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, పార్టీ రాజకీయ కార్యదర్శి తెలిపారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News