Tea powder: ఏమి'టీ' ధర.. అక్షరాలా నలభై వేల రూపాయలా?

షార్ట్స్‌లో చూడండి
కిలో టీ పొడి నలభై వేల రూపాయల ధర ఎప్పుడైనా విన్నారా?
అబ్బే...అంతెందుకు ఉంటుంది? అనుకుంటున్నారా... మీరెలా అనుకున్నా ఇది మాత్రం నిజం. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం డోన్యీ పోలో టీ ఎస్టేట్‌లో పండించిన ‘గోల్డెన్‌ నీడిల్స్‌’ రకం టీ పొడికి గురువారం వేలంలో దక్కిన రికార్డు ధర  ఇది.

గువహటికి చెందిన ‘అస్సాం టీ ట్రేడర్స్‌’ ఈ వేలాన్ని దక్కించుకుంది. గతంలో 39 వేల రూపాయలు పలికిన అసోం టీ తోట రకం ధరను ఇప్పుడు ‘గోల్డెన్‌ నీడిల్స్‌’ రకం బద్దలు కొట్టింది. ఈ రకం తేయాకుతో తయారైన తేనీరు ఎంతో రుచిగా ఉంటుందని ఎస్టేట్‌ అధికారులు  చెబుతున్నారు. 
Go Back to Shorts
Tea powder

More Telugu News