sump: హైదరాబాద్ లో సంపులో పడి చిన్నారి దుర్మరణం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు!

  • హైదరాబాద్ లోని బుద్ధనగర్ లో ఘటన
  • ఆడుకుంటూ సంపులో పడిపోయిన చిన్నారి
  • యజమానిపై కేసు పెట్టిన పోలీసులు

నీటి సంపు మూత వేయకపోవడంతో ఓ రెండేళ్ల చిన్నారి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని బుద్దనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది

బుద్ధనగర్ లోని ఓ ఇంట్లో ఉన్న చిన్నారి రక్షిత్(2) మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఎదురుగా ఉండే ఇంటిలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న నీటి సంపుకు మూత వేయకపోవడంతో చిన్నారి కాలుజారి అందులోకి పడిపోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇంతలోనే సంపులో విగతజీవిగా ఉన్న చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు.

తమ చిన్నారి ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని వారు ఆరోపించారు. అనంతరం సదరు వ్యక్తి ఇంటిముందు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం సంపు ఉన్న ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News