Jana Sena: త్వరలోనే జనసేనలోకి 20 మంది ఎమ్మెల్యేలు: ఏపీ రాష్ట్ర కన్వీనర్ పార్థసారథి

  • పవన్ నిర్ణయం తీసుకున్నాక తేదీ ప్రకటిస్తాం
  • మరికొందరు ముఖ్య నేతలు కూడా టచ్‌లో ఉన్నారు
  • పార్టీ పాత, కొత్త తరం నాయకుల మేలు కలయిక
పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడానికి ఏపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కన్వీనర్ వి.పార్థసారథి తెలిపారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే పవన్‌తో చర్చించారని, ఆయన నిర్ణయం తీసుకుని, తేదీ ఖరారు చేసిన తర్వాత వారంతా వచ్చి పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాత, కొత్త తరం మేలు కలయికతో పార్టీ ముందుకెళ్తుందన్న ఆయన.. పార్టీలో నవతరానికి 60 శాతం సీట్లు ఇస్తామని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కోటి చొప్పున మేనిఫెస్టోలు తయారుచేస్తామని పార్థసారథి వివరించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మేడా గురుదత్ ప్రసాద్, ఉభయ జిల్లాల కన్వీనర్ కలవకొలను తులసితో కలిసి రాజమహేంద్రవరంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh
Congress
Telugudesam

More Telugu News