Chandrababu: ఆ విషయం కూడా తెలియకపోతే ఎలా?: 'పొత్తు'లపై కేఈ, అయ్యన్నలపై చంద్రబాబు ఫైర్

  • కాంగ్రెస్‌తో పొత్తు వార్తలను ఖండించిన కేఈ, అయ్యన్న
  • పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటానంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • పిలిపించి మందలించిన చంద్రబాబు

పొత్తులపై పదేపదే మాట్లాడుతుండడంపై మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై పార్టీలో ఎటువంటి చర్చ జరగకుండానే ఎందుకు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ మీడియా ప్రభావానికి గురి కావద్దని సూచించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటారన్న విషయం సీనియర్ మంత్రులకు కూడా తెలియకపోతే ఎలా? అని క్లాస్ తీసుకున్నారు. పొత్తుల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని సూచించారు.

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో టీడీపీ కలిసి ముందుకెళ్లే ప్రసక్తే లేదని కొట్టిపడేశారు. ఒకవేళ అదే జరిగి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. మరో మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా పొత్తు వార్తలపై తీవ్రంగానే స్పందించారు. దీంతో ముఖ్యమంత్రి వీరిద్దర్నీ పిలిపించుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై స్పష్టత వచ్చే వరకు బయట ఈ విషయం గురించి మాట్లాడొద్దని, జగన్ మీడియా ప్రభావానికి గురికావద్దని సూచించారు.

More Telugu News