sc st: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ లకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహోపయోగ విద్యుత్ : సీఎం కేసీఆర్

  • గృహోపకరణాలకు విద్యుత్ వాడకం పెరిగింది
  • తెలంగాణలో విద్యుత్ పరిస్థితి మెరుగైంది
  • అందుకే, ఉచిత విద్యుత్ ను అందిసున్నాం

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా గృహోపయోగ విద్యుత్ ను అందివ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

టీవీల వినియోగంతో పాటు ఇతర గృహోపకరణాలకు విద్యుత్ వాడకం పెరిగిందని అన్నారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితి మెరుగైనందున దాని ఫలితాన్ని అట్టడుగు వర్గాలకు అందాలని, అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ను అందించేందుకు అయ్యే విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే డిస్కమ్ లకు చెల్లిస్తుందని పేర్కొన్నారు.

More Telugu News