jarkhand: లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు షాక్.. ఆగస్టు 30 లోపు జైలుకు వెళ్లాలని ఆదేశం!

  • ముంబైలో చికిత్స పొందుతున్న లాలూ
  • ఈ నెల 30లోగా బిస్రా ముండా జైలుకు
  • దాణా కుంభకోణం కేసులో శిక్ష
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు ఈ రోజు షాకిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా తన పెరోల్ ను పొడిగించాలన్న లాలూ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ నెల 30లోపు రాంచీలోని బిస్రా ముండా జైలుకు వెళ్లాలని ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఓ కేసులో రాంచీ సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చి శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జైలులో ఉండగా ఆరోగ్యం క్షీణించడంతో కోర్టు ఆయనకు మే 11న పెరోల్ మంజూరు చేసింది. దీంతో లాలూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి లాలూకు న్యాయస్థానం పెరోల్ గడువును పెంచుతూ వచ్చింది. తాజాగా పెరోల్ గడువు మరోసారి పెంచాలని లాలూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే రాంచీలోని రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు ఆయనను తరలించాలని జైలు అధికారులను ఆదేశించింది.
jarkhand
High Court
lalu prasad yadav
bihar cm
bihar
fodder scam

More Telugu News