Atal Bihari Vajpayee: వాజ్‌పేయి మరణంపై ఏమిటీ రాజకీయం?: బీజేపీపై మేనకోడలు కరుణ ఫైర్

  • ఆయన మరణాన్ని వచ్చే ఎన్నికలకు సానుభూతిగా వాడుకుంటున్నారు 
  • బీజేపీది స్వార్ధ రాజకీయం అన్న కరుణ  
  • చితాభస్మ కలశాలతో ర్యాలీలు చేయడంపై విమర్శ 
బీజేపీపై మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లా మండిపడ్డారు. ఆయన మరణాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆమె ఆరోపించారు. బతికుండగా ఆయన వల్ల లబ్ధి పొందిన బీజేపీ, మళ్లీ ఆయన మరణంతో కూడా లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. లేకుంటే ఆయన చితాభస్మ కలశాలతో ర్యాలీలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కరుణ బీజేపీ పై ఫైర్ అయ్యారు. బీజేపీది స్వార్ధ రాజకీయం అంటూ నిందించారు. 2019 ఎన్నికల్లో వాజ్‌పేయి మరణాన్ని కూడా సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆమె మండిపడ్డారు.  
Atal Bihari Vajpayee
BJP

More Telugu News