geeta govindam: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న గీత గోవిందం.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే సరికొత్త రికార్డు!

  • భారీ వసూళ్లు రాబడుతున్న సినిమా
  • అమెరికాలోనే రూ.11.98 కోట్ల వసూలు
  • వివరాలు తెలిపిన చిత్ర బృందం
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా పరశురామ్ తెరకెక్కించిన 'గీత గోవిందం' ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.75 కోట్లను (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గీత గోవిందం విదేశాల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోందని వెల్లడించింది.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. గీత గోవిందం సినిమా అమెరికాలో ఇప్పటివరకూ 11.98 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. గత మంగళవారం ఈ సినిమా ఏకంగా 1,19,247 డాలర్లు రాబట్టిందని వెల్లడించారు. మొత్తంగా సినిమా రూ.75 కోట్ల మార్క్ ను అందుకుందని పేర్కొన్నారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిందన్నారు.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.
geeta govindam
vijay devarakonda
rashmika
R.75 crore
parasuram

More Telugu News