35 ఏళ్లకు పెళ్లి చేసుకుంటా.. అమ్మాయి ఎవరైనా కావచ్చు!: విజయ్ దేవరకొండ
- గతంలో 40 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నా
- గీత గోవిందం ఎఫెక్ట్ దీనికి కారణం కావొచ్చు
- చిత్రవిచిత్రమైన కోరికలేం లేవన్న విజయ్
తన మైండ్ సెట్ కు పెద్దలు కుదిర్చిన పెళ్లి అసలు సెట్ కాదని విజయ్ స్పష్టం చేశాడు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని అన్నాడు. ‘ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి కావొచ్చు.. కాకపోవచ్చు. ప్రపంచంలో ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ మేమిద్దరం కనెక్ట్ కావాలి. ఒకరినొకరు తెలుసుకోవాలి’ అని విజయ్ తన కలల రాణి గురించి చెప్పుకొచ్చాడు. గీత గోవిందం సినిమాలోని తన పాత్ర గోవిందం తరహాలో ప్రత్యేకమైన కోరికలు ఏవీ తనకు లేవని విజయ్ అన్నాడు.