cvhiranjeevi: చిరంజీవిని 'ఖైదీ' ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
రచయితగా పరుచూరి గోపాలకృష్ణ పనిచేసిన సినిమాలు చాలా వరకూ ఘన విజయాలను సాధించాయి. దాదాపు అందరి అగ్రహీరోల సినిమాలకి ఆయన పనిచేశారు. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, చిరంజీవితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. చిరంజీవి .. మేము కలిసి పనిచేసిన మొదటి సినిమా 'రోషగాడు'. ఆ తరువాత మా కాంబినేషన్లో వచ్చిన 'ఖైదీ' చరిత్ర సృష్టించింది.

చిరంజీవిని మార్నింగ్ షో నుంచి ఆకాశం అంత ఎత్తున నిలబెట్టిన చిత్రం 'ఖైదీ'. ఆ తరువాత చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసుకుంటూ వెళ్లారు. కానీ ఆయన ఎప్పుడూ 'ఖైదీ' సినిమాను మరిచిపోలేదు. ఆ సినిమా నుంచి ఆయనతో మాకు గల అనుబంధం పెరుగుతూ వచ్చింది. ఒకసారి 'లలితకళా తోరణం'లో మాట్లాడుతూ .. "తెలుగు చిత్రపరిశ్రమకి సంబంధించి ఒక పుస్తకం వెలువడితే, అందులో పరుచూరి బ్రదర్స్ కి చెరో పేజీ వుంటుంది" అని చెప్పిన మహానుభావుడు చిరంజీవి" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
cvhiranjeevi
paruchuri

More Telugu News