mahesh: మహేష్ 'మహర్షి' సెట్ లో విజయ్ దేవరకొండ

  • షూటింగు దశలో 'మహర్షి'
  • మహేశ్ ను కలిసిన విజయ్ దేవరకొండ
  • సినిమాకి సంబంధించిన ముచ్చట్లు
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో కీలకమైన సందర్భంలో వస్తాయని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.        

ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్లాడు. వంశీ పైడిపల్లితోను .. మహేశ్ తోను సరదాగా ముచ్చటించాడు. మహేశ్ బాబు సినిమా టికెట్స్ కోసం థియేటర్ల దగ్గర ఫైట్ చేసిన తాను .. ఆయనను కలుసుకుని ముచ్చటించడం అద్భుతంగా అనిపించిందని అన్నాడు. విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆయనకి వచ్చిన క్రేజ్ ఎక్కువ. స్టార్ హీరోలందరినీ కలుపుకుని వెళుతూ ఆయన యూత్ కి మరింత చేరువవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై వున్న ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో ఆయన వున్నాడు.      
mahesh
vijay
vamshi

More Telugu News