marital affair: అక్రమ సంబంధం: భార్యను, ఆమె ప్రియుడిని కొడవలితో నరికి చంపిన భర్త!

  • తమిళనాడు తూత్తుకుడిలో ఘటన
  • హెచ్చరించినా మారని భార్య
  • భార్య, ఆమె ప్రియుడిని హత్యచేసిన భర్త
తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భర్త.. ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి ముమ్మలంపట్టి గ్రామానికి చెందిన హరికృష్ణ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య తంగమారి, ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన రైతు పెరుమాల్ కు తంగమారితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ వ్యవహారంపై భర్త, బంధువులు పలుమార్లు హెచ్చరించినా తంగమారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో హరికృష్ణ ఇంటికి వచ్చాడు. అతను రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుండగా, భార్య తంగమారి పాలలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చింది. దాన్ని తాగినట్లుగా హరికృష్ణ నటించాడు. భర్త నిద్రలోకి జారుకున్నాడని భావించిన తంగమారి అర్ధరాత్రి పెరుమాల్ కు ఫోన్ చేసింది.

ఊరి బయట ఉన్న పత్తి తోటలోకి రావాలని అతను తంగమారికి సూచించాడు. దీంతో ఇంటి తలుపులు దగ్గరికివేసి ఆమె అక్కడకు బయలుదేరింది. భార్య ప్రవర్తనతో ఆగ్రహానికి లోనైన హరికృష్ణ వేట కొడవలి తీసుకుని వెంబడించాడు. చివరికి వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ దాడిలో పెరుమాల్ అక్కడికక్కడే చనిపోయాడు. భార్య తంగమారి అక్కడి నుంచి పారిపోతుండగా, హరికృష్ణ వెంటాడి మరీ కొడవలితో నరికాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
marital affair
Tamilnadu
murder

More Telugu News