kcr: గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ

  • గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్
  • ‘ముందస్తు’, ప్రగతి నివేదన సభ..అంశాలపై చర్చ?
  • ఈ భేటీపై రాజకీయవర్గాల్లో చర్చ

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. టీ-మంత్రులతో నిన్న జరిగిన సమావేశం, ముందస్తు ఎన్నికలు, వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ, ‘రైతుబీమా’,‘కంటి వెలుగు’ పథకాలు, శాసనసభా నిర్వహణ తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

 కాగా, ఈ రోజు ఉదయం మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యనేతలను కలిసిన కేటీఆర్ వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. కేటీఆర్ తిరిగొచ్చిన కొద్ది సేపటికే గవర్నర్ ని కలిసేందుకు కేసీఆర్ వెళ్లడం గమనార్హం. కాగా, టీ-మంత్రులతో కేసీఆర్ నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందస్తు ఎన్నికలపై తమ నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

More Telugu News